'ఈగ 2' సీక్వెల్‌ తీయాలని కోరుకుంటున్న నాని

- September 28, 2016 , by Maagulf
'ఈగ 2' సీక్వెల్‌ తీయాలని కోరుకుంటున్న నాని

నాని హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ డ్రామా 'ఈగ' చిత్రం 2012లో విడుదలై మంచి విజయం సాధించింది. ఓ అభిమానిగా ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటే బావుంటుందని నాని అభిప్రాయపడ్డారు. 'ఈ రోజుకీ 'ఈగ 2' గురించి వస్తున్న రిపోర్ట్స్‌ను చదువుతున్నా. అది నిజం కావాలని కోరుకుంటున్నా. ఇంకా ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి సమాచారం లేదు. రాజమౌళిని కలిసినప్పుడు.. సరదాగా ఈ సీక్వెల్‌ గురించి అడిగాను. 'ఈగ' అభిమానిగా దీనికి సీక్వెల్‌ కావాలని అనుకుంటున్నా. తొలి విభాగంలో నేను చనిపోయా.. టెక్నికల్‌గా రెండో విభాగంలో నా పాత్ర ఉండదు.
అయినప్పటికీ సీక్వెల్‌ తీయాలని కోరుకుంటున్నా. ఏదేమైనప్పటికీ.. 'ఈగ 2' తీయాలా, వద్దా అన్న నిర్ణయం పూర్తిగా రాజమౌళిదే. నేను ఆసక్తిగా దాని కోసం ఎదురుచూస్తున్నా' అని నాని అన్నారు.'ఈగ' చిత్రంలో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. నాని ప్రస్తుతం 'పక్కా లోకల్‌' చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన కీర్తీసురేశ్‌ నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com