మొబైల్ ఫోన్లు దొంగిలించిన కేసులో నిర్వాసితునికి జైలు శిక్ష
- September 29, 2016
మొబైల్ ఫోన్లు దొంగిలించిన కేసులో కెన్యా దేశానికీ చెందిన ఒక వ్యక్తికి దోహా క్రిమినల్ కోర్ట్ ఒక సంవత్సరం వరకు జైలుశిక్ష అనంతరం ఆ వ్యక్తిని దేశ బహిష్కరణకు గురిచేస్తున్నట్లు ఆదేశించింది, నిందితుడు ఒక మహిళ యొక్క చేతి సంచి నుంచి 2,500 క్యూ ఆర్ లను సిమ్ కార్డులతో సహా రెండు మొబైల్ ఫోన్లు దొంగిలించాడని దొంగిలించాడని కోర్టుకి ప్రాసిక్యూషన్ తెలిపింది. సంఘటన జరిగిన సమయంలో, ఒక హోటల్ రెస్టారెంట్ కు ఓ మహిళ విందుకు వెళ్ళింది. ఆమె టాయిలెట్ కు వెళ్లినప్పుడు టేబుల్ మీద ఆమె హ్యాండ్ బ్యాగ్ వదిలి వెళ్ళింది. ఇది గమనించిన నిందితుడు వాటిని అపహరించి అక్కడ్నించి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు రెస్టారెంట్ నిఘా కెమెరాల రికార్డింగ్ ఫుటేజ్‌ని సమీక్షించారు. ఆ వీడియోలలో కెన్యా దేశానికీ చెందిన ప్రతివాదిని గుర్తించారు. గత సందర్భాలలో ఆ వ్యక్తి ఇదే మాదిరిగానే దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది . ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినపుడు రెండు ఫోన్లని అతని నుండి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







