ఆడి క్యూ5 విక్రయాలను ఇండియాలో నిలిపేసింది!
- September 29, 2016
కాలుష్యాలు వెదజల్లుతున్నాయన్న కారణంపై ఆడి క్యూ5 విక్రయాలను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ.. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్‌ఏఐ) నిర్వహించిన పరీక్షలో ఈ కారులో అనుకున్నదానికంటే ఎక్కువగా కాలుష్యం వదులుతున్నట్లు తేలింది.
దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలియజేశాయి. డీజిల్ వెర్షన్ కారు నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్.. కాలుష్య ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వాహనాలకు వర్తించే నిబంధనలకు లోబడి ఈ కారును తయారు చేసి మళ్లీ విడుదల చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎప్పటిలోగా రానున్నదో మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







