సౌదీ అరేబియాలో 102 మహిళా న్యాయవాదులు

- September 29, 2016 , by Maagulf
సౌదీ అరేబియాలో 102 మహిళా న్యాయవాదులు

జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్‌ జస్టీస్‌ తాజాగా వెల్లడించిన రిపోర్ట్‌ ప్రకారం ఏడాది కాలంలో అత్యధికంగా లా ప్రాక్టీస్‌ కోసం లైసెన్సులు మంజూరు చేసినట్లు వెల్లడయ్యింది. 1437 హిజ్రి ఇయర్‌లో మినిస్ట్రీ 512 లైసెన్సుల్ని జారీ చేయగా 39 మహిళా న్యాయవాదులకు జారీ చేసిన లైసెన్సులు ఉన్నాయి. కింగ్‌డమ్‌లో మొత్తం 3,844 మంది లైసెన్స్‌ గల న్యాయవాదులు ఉండగా, అందులో 102 మంది మహిళా న్యాయవాదులున్నారు. సౌదీ అరేబియా చట్టం ప్రకారం జనాభాకి తగిన నిష్పత్తిలో న్యాయవాదుల సంఖ్య ఉంది. జనరల్‌ అథారిటీ లెక్కల ప్రకారం సౌదీ అరేబియా జనాభా 31,015,999. ప్రతి 8069 మందికీ ఓ న్యాయవాది ఉన్నారిప్పుడు. అయితే పురుష లాయర్లతో పోల్చితే మహిళా న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తొలిసారిగా ఓ మహిళా న్యాయవాది లైసెన్సు పొంది, కార్యాలయాన్ని ప్రారంభించడం 2014లో జరిగింది. లైసెన్స్‌ పొంది న్యాయవాది కాఆ్యలయంలో అది కూడా సౌదీ అరేబియాలో మూడేళ్ళపాటు శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్‌ మాత్రమే కొత్తగా లైసెన్స్‌ పొందేందుకు అర్హులవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com