జై జవాన్!! అంటున్న కాంగ్రెస్

- September 29, 2016 , by Maagulf
జై జవాన్!! అంటున్న కాంగ్రెస్

నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడిని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభినందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. దేశాన్ని, ప్రజల్ని కాపాడేందుకు భారత సైన్యం చేస్తున్న దానికి కాంగ్రెస్‌ పార్టీ సెల్యూట్‌ చేస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు తెలుపుతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ వెల్లడించారు. లక్షిత దాడుల గురించి ప్రభుత్వం అన్ని వివరాలు తమకు తెలియజేసిందని, ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇవి కేవలం లక్షిత దాడులు మాత్రమే కాదని, పాకిస్థాన్‌కు ఇదొక హెచ్చరికలాంటిదని చత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ అన్నారు. ఉగ్రదాడులు చేస్తే ఇక సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు సాగే సైనిక స్థావరాలు, ఉగ్రవాదులపై సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో విజయం సాధించాలి. భారత సైన్యాన్ని చూసి గర్విస్తున్నాం. మరోసారి సైన్యం తమ ధైర్య సాహసాలను చూపారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు.
భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నియంత్రించేందుకు భారత సైన్యం గత అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 4.30 గంటల నుంచి లక్షిత దాడులను చేపట్టిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com