నాసా తో ఉప్పందం కుదుర్చుకున్న చైనా

- September 29, 2016 , by Maagulf
నాసా తో ఉప్పందం కుదుర్చుకున్న చైనా

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ఒకటి. కానీ ఇక్కడి విమాన ప్రయాణికులు మాత్రం ఒక్కోసారి ఆలస్యంగావస్తున్న విమానాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 50 బిలియన్ల యువాన్లు(7.49 మిలియన్‌ డాలర్ల)ప్రాజెక్టును రూపొందించి నాసాతో ఒప్పందం చేసుకుందని దేశానికి చెందిన వార్తాసంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ మేరకు చైనా విమానరంగ విస్తరణ విభాగం (సీఏఈ)తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విమానాశ్రయాల అభివృద్ధితో పాటు, విమానాల రద్దీ నియంత్రణ తదితర అంశాలపై పరిశోధన చేసి సమస్యకు పరిష్కారం చూపనున్నట్టు నాసా నిర్వాహకుడు చార్లెస్‌ బోల్డెన్‌ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com