షార్జాలో అర్ధరాత్రి అపార్ట్మెంట్ ను చుట్టుముట్టిన అగ్నిజ్వాలలు

- September 29, 2016 , by Maagulf
షార్జాలో అర్ధరాత్రి  అపార్ట్మెంట్ ను చుట్టుముట్టిన అగ్నిజ్వాలలు

షార్జా: అర్ధరాత్రి అగ్ని జ్వాలలు చుట్టుముట్టడంతో ఆ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న డజన్ల కొద్దీ కుటుంబాలను పోలీసులు ఖాళీ చేయించారు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం షార్జా లోని అల్ రహదా రోడ్ లోని ఒక నివాస భవనం వద్ద జరిగింది. ఈ అగ్నిప్రమాదంపై  తక్షణమే స్పందించిన మంటలను సివిల్ డిఫెన్స్ దళం నియంత్రణలోకి తీసుకువచ్చారు.

కేంద్ర స్థానం నుంచి సంనం మరియు మువైలేఇహ్ అగ్నిమాపక స్టేషన్లు సంఘటనా స్థలంకు వచ్చి  అగ్ని ప్రమాదం నివారించే ప్రయత్నంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికే ఎటువంటి గాయాలు కాలేదని షార్జా పోలీసులు తెలిపారు. అయితే ఈ  అగ్నిప్రమాదానికి ముఖ్య కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సాయుధ దళాల తదుపరి దర్యాప్తు కోసం షార్జా పోలీస్ అగ్ని నిపుణులకు  ఈ స్థలాన్ని అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com