'కొడి' ఫస్ట్‌లుక్‌ విడుదల....

- September 29, 2016 , by Maagulf
'కొడి' ఫస్ట్‌లుక్‌ విడుదల....

ప్రభు సాలమన్‌ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'తొడరి' సినిమాతో ధనుష్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దీపావళికి కూడా ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమయ్యారు. శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కిన 'ఎదిర్‌నీచ్చల్‌' సినిమా ద్వారా దర్శకుడిగా అడుగుపెట్టారు దురై సెంథిల్‌కుమార్‌. ఆయన దర్శకత్వంలో ధనుష్‌ నటించిన కొత్త చిత్రం 'కొడి'. త్రిష కథానాయిక. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి సినిమా ఇది. వెట్రిమారన్‌ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను బుధవారం రాత్రి విడుదల చేశారు. అందులో రెండు భిన్నమైన గెటప్‌లలో ధనుష్‌ కనిపిస్తున్నారు.నిండు గడ్డంతో ఉన్న ధనుష్‌ లుక్‌ చాలా కొత్తగా అనిపిస్తోంది. 'పుదుప్పేట', 'ఆడుకలం' చిత్రాల్లో ధనుష్‌ గడ్డంతో నటించినప్పటికీ.. ఇది కాస్త భిన్నంగానే ఉంది. ఇందులో మరో ధనుష్‌ రూపం 'తంగమగన్‌'లో మాదిరిగా అనిపిస్తోంది.ఏదేమైనప్పటికీ కమర్షియల్‌ హంగులతో 'రెట్టై దీపావళి' వినోదాన్ని పంచేందుకు సిద్ధమని చిత్రయూనిట్‌ ప్రకటించింది. ప్రస్తుతం పాటలు, ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com