గాయాల పాలైన హీరో రామ్

- August 13, 2015 , by Maagulf
గాయాల పాలైన హీరో రామ్

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ 'శివం' షూటింగ్‌లో గాయపడ్డాడు. యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లగా, వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు. అయితే రామ్ డాక్టర్ల మాటను లెక్కచేయకుండా మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీంతో ఆ గాయం మరింత పెద్దదై నొప్పి తీవ్రత పెరిగింది. డాక్లర్లను సంప్రదించగా విశ్రాంతి తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే నొప్పి మరింత పెరిగే ప్రమాదముందని, తప్పనిసరిగా నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడం తో రామ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు . మొదట డాక్టర్ల మాట వినందుకే ఇలా జరిగిందని, అందుకే వైద్యులు చెప్పినట్లు పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నానని ట్విట్టర్‌లో రామ్ పేర్కొన్నాడు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శివం చిత్రం రాబోతుంది. రామ్‌కు జోడీగా రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com