చరణ్ సినిమాలో నటిస్తున్న నాగబాబు

- August 13, 2015 , by Maagulf
చరణ్ సినిమాలో నటిస్తున్న నాగబాబు

శ్రీనువైట్ల, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నట్లు తెలిసింది. నాగబాబుతో కృతి కర్బందా కాంబినేషన్‌లో కొన్ని సీన్లు ఉంటాయని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తారనే వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కింగ్ నాగార్జున సంగతి ఎలా ఉన్నా....చిరంజీవి మాత్రం ఈ చిత్రంలో నటించడం ఖాయమంటున్నారు మెగా అభిమానులు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో వాయిస్ ఓవర్ చెప్పించాలని దర్శకుడు శ్రీనువైట్ల నిర్ణయించినట్లు సమాచారం. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం 'విజేత' టైటిల్‌నే ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com