మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ హీరోగా..

- September 30, 2016 , by Maagulf
మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ హీరోగా..

మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ హీరోగా పరిచయం అవడానికి సిద్ధమయ్యారు. బాలనటుడిగా 2002లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు పొందిన ప్రణవ్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడని మోహన్‌లాల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. 'ప్రణవ్‌ మోహన్‌లాల్‌ నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్న చిత్రంలో అతడు కథానాయకుడిగా నటించనున్నాడు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై 'దృశ్యం' చిత్రం తర్వాత వస్తున్న థ్రిల్లర్‌ కథా చిత్రమిది' అని మోహన్‌లాల్‌ ట్వీట్‌ చేశారు.ఈ సందర్భంగా ప్రణవ్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com