మంజు వారియర్‌ హీరోగా అరవింద్‌స్వామి

- October 02, 2016 , by Maagulf
మంజు వారియర్‌  హీరోగా అరవింద్‌స్వామి

1990లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అరవింద్‌స్వామి. అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమయ్యారు. చాలా గ్యాప్‌ తర్వాత ఆయన నటించిన 'తని ఒరువన్‌' మంచి గుర్తింపు తెచ్చింది. కెరీర్‌ పరంగా ఆయన రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా మారింది. భిన్నమైన పాత్రలో ఇంటెలిజెంట్‌ విలన్‌గా నటించి మెప్పించారు. ఆయన శైలి నచ్చినందువల్లే ఈ సినిమా తెలుగు రీమేక్‌లో కూడా అరవింద్‌స్వామినే నటించాలని నటుడు రాంచరణ్‌ కూడా పట్టుబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన 'బోగన్‌'లో మళ్లీ జయంరవితో కలసి నటిస్తున్నారు. తాజాగా 'చదురంగవేట్టె 2' సినిమాలో నటించేందుకు కూడా అంగీకరించారు.
ఇందులో ఆయనకు జంటగా త్రిష నటించడం విశేషం. ఈ నేపథ్యంలో మరో కొత్త సినిమాకు కూడా అరవింద్‌ సిద్ధమయ్యారు. విజయ్‌ హీరోగా 'తిరుమలై' సినిమాను రూపొందించిన రమణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
మంజు వారియర్‌ నటిస్తున్న తొలి తమిళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. యాక్షన్‌, థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com