'గుంటూర్ టాకీస్ 2' .....
- October 02, 2016
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రేశ్మి ప్రధాన పాత్రలో తెరకెక్కి ఘన విజయం సాధించిన 'గుంటూర్ టాకీస్' చిత్రానికి ప్రస్తుతం కొనసాగింపు సినిమా రాబోతోంది. 'గుంటూర్ టాకీస్ 2' హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. వినీత్, అదితిసింగ్ జంటగా రాజ్‌కుమార్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొం దిస్తున్నారు. మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన నరేష్ ..ఈ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు.
'గుంటూర్ టాకీస్ 2 ' ప్రారంభోత్సవం అనంతరం దర్శక నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ..' 'గుంటూర్ టాకీస్' విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాం. ప్రస్తుతం మేము నిర్మించిన 'రాజా మీరు కేక' విడుదలకు సిద్ధవుతోంది. మంచి కథ దొరకడంతో ప్రొడక్షన్ నెంబర్ 3 గా 'గుంటూర్ టాకీస్ 2' ప్రారంభించాం. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాం. పూరీ జగన్నాథ్ గారి దగ్గర పనిచేసిన కిరణ్ కథా స్క్రీన్ ప్లే అందించాడు. దసరా పండక్కి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని భావిస్తున్నాం ' అన్నారు. నటుడు నరేష్ మాట్లాడుతూ.."గుంటూర్ టాకీస్' కొత్త జానర్ సినిమాగా మాస్, యూత్ ను ఆకట్టుకుంది. ఆ సినిమాలో నేను పోషించిన గిరి అనే పాత్ర బాగా పేరు తెచ్చింది. ఈ సీక్వెల్ లోనూ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. 'గుంటూర్ టాకీస్ 2' కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. ముంబైలో సెట్ వేసి కొంత భాగం చిత్రీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.' అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు వినీత్, అదితి సింగ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. 'గుంటూర్ టాకీస్ 2' చిత్రానికి సినిమాటోగ్రఫీ : రామ్ రెడ్డి, సంగీతం : శ్రీ చరణ్ , ఎడిటింగ్ : ఎస్ ఆర్ శేఖర్, ఆర్ట్ : మారిష్
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









