' కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం ఒక నేరం '

- October 03, 2016 , by Maagulf
' కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం ఒక నేరం '

జెడ్డా : కార్మిక జాతీయ కమిటీ (NCL) చైర్మన్, నోడల్  రాడ్వాన్  రాజ్యంలో కొన్ని కంపెనీలు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యారని ఇది ఎంతో అన్యాయపూరిత చర్య అని ఉద్యోగులు వారి హక్కును పూర్తిగా ఉల్లంఘించడమేనని అన్నారు. దీనితో దేశం యొక్క కీర్తికి  చెడ్డపేరు వస్తుందని ఆయన చెప్పారు. అటువంటి పద్ధతులు ఖచ్చితంగా నిలిపివేయాలి," అని ఆయన తెలిపారు.అలాంటి సంస్థల యజమానులు కార్మికుల హక్కులు గూర్చి తెలుసుకోవాలి  మరియు వారు వేతనాలు లేకుండా ఉచితంగా పని చేయడం మంచిది కాదని తెలుసుకోవటం తప్పక గమనించాలని ఆయన  చెప్పారు. చెల్లింపులు ఆలస్యం కావడం  చట్టం మరియు అంతర్జాతీయ నిబంధనలను, మతం లోను వారి హక్కులని ఉల్లంఘన చేయరాదని ఆయన తెలిపారు. జీతాలు కోల్పోయిన కార్మికులు ఆగ్రహంతో  ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తిని పాడు చేసే చర్యలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com