సరైన సమయంలో వేతనాల కోసం కొత్త చట్టం

- October 03, 2016 , by Maagulf
సరైన సమయంలో వేతనాల కోసం కొత్త చట్టం

క్టోబర్‌ 3 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టం ద్వారా యూఏఈలోని కార్మికులు సకాలంలో వేతనాలు అందేందుకు మార్గం సుగమం అవుతుంది. మినిస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ సక్ర్‌ బిన్‌ ఘోబాష్‌ సయీద్‌ ఘోబాష్‌ జారీ చేసిన డిక్రీ ద్వారా, 100కి పైగా కార్మికులు గల కంపెనీలు రిజిస్టర్‌ పే సమయానికి 10 రోజుల్లోపే వేతనాల్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో 16వ రోజు నుంచీ, ఆ కంపెనీ కొత్తగా ఎవరికీ వర్క్‌ పర్మిట్లు జారీ చేయకుండా నిషేధం విధిస్తుంది. లేబర్‌ మార్కెట్‌ని స్టేబిలైజ్‌ చేయడానికి వీలుగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ ఫర్‌ ఇన్‌స్పెక్షన్స్‌ మెహెర్‌ అల్‌ ఒబెద్‌ చెప్పారు. ప్రధానంగా జీతాల సమస్యను నిరోధించే దిశగా ఈ చట్టం వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు. నెల రోజులపాటు గనుక వేతనాలు చెల్లించని పక్షంలో, సదరు సంస్థ గురించి మినిస్ట్రీ జ్యుడీషియరీకి రిఫర్‌ చేస్తుంది. తదనంతరం అవసరమైన చర్యల్ని తీసుకుంటుంది. 60 రోజులపాటు జీతాలు చెల్లించకపోతే, కఠినంగా జరీమానాల్ని విధిస్తారు. ఒక్కో వర్కర్‌కీ 5,000 దిర్హామ్‌ల చొప్పున కంపెనీకి జరీమానా విధించడం జరుగుతుంది. 100 మంది లోపు కార్మికులకు మాత్రం ఇదివరకు ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com