ఉపేంద్ర 2 రివ్యూ
- August 14, 2015
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్నా....దర్శకుడిగా, నటుడిగా ఉపేంద్ర టాలెంట్ మొత్తం దక్షిణాది ప్రేక్షకులకు తెలుసు. సుమారు పాతికేళ్లుగా ప్రయోగాత్మక చిత్రాలే అతని బ్రాండ్ ను కాపాడుతున్నాయి. ఉపేంద్ర 2 కూడా అతని ట్రేడ్ మార్కును కాపాడే సినిమానే...అయితే కథలో ట్విస్టులు ఎక్కువై...కన్ ఫ్యూజన్ కు గురి చేసింది. రెండో సారి చూస్తే గానీ...సినిమా అర్థమయ్యే పరిస్థితి సాధారణ ప్రేక్షకుడికి లేదు. కథ... నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తిస్తాడని చూపించే కథతో....పదిహేనేళ్ల కిందట ఈ నటుడు తెరకెక్కించిన సినిమా ఉపేంద్ర. ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిందే ఉపేంద్ర 2. అయితే కథ పూర్తిగా భిన్నం. నేను అంటే స్వార్థం నువ్వు అంటే నిస్వార్థం అనే భావాన్నిస్తూ...ఉపేంద్ర 2 సినిమా సాగుతుంది. నువ్వు అనే పేరుతో అంతా పిలిచే ఉపేంద్ర ఊళ్లో అందరికీ స్నేహితుడులా...పనివాడిలా ఉంటాడు. ప్రతిఫలం ఆశించకుండా అందరి పనులు చేస్తుంటాడు. ఈ పనులు చేయడం నాకు సంతోషం...సంతోషంగా ఉంటే డబ్బునట్లే అంటాడు. నిన్న ఏం జరిగిందో...రేపు ఏం జరగబోతోందో...అనవసరం...కేవలం ఇప్పుడు జరిగేదే ముఖ్యమంటాడు. ఇలాంటి వ్యక్తికి హ్యాపీ అనే ఓ యువతి పరిచయమవుతుంది. అతని పిలాసఫీ, ప్రవర్తన నచ్చి ఇష్టపడుతుంది. ఊళ్లో అందరికీ స్నేహితుడిలా నిస్వార్థంగా ఉంటున్న ఉపేంద్ర...కావాలనే అలా నటిస్తున్నాడనే విషయం ఇంటర్వెల్ ట్విస్టుతో తెలుస్తుంది. అసలు అతనెందుకు ఊళ్లోకి వచ్చాడు. వేల కోట్ల ఆస్తితో అతనికి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ.. విశ్లేషణ.. దర్శకుడిగా, నటుడిగా ఉపేంద్ర ప్రత్యేకత సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కనిపిస్తుంటుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ముందు వచ్చే డ్రామా నుంచి...ఆ తర్వాత ఇంటర్వెల్ వరకు సాగే కథ...చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లైఫ్ గురించి ..మనిషి సంతోషంగా ఉండాలంటే ఎలా బతకాలనే దాని గురించి పస్టాఫ్ లో ఉపేంద్ర చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. పాటల చిత్రీకరణ వైవిధ్యంగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరినా....సెకండాఫ్ లో కథలో ట్విస్టులు ఎక్కువై కన్ ఫ్యూజ్ చేస్తాయి. అప్పటిదాకా మంచివాడుగా ఉన్న ఉపేంద్ర డబ్బు కోసం గేమ్ ఆడుతున్నాడనేది స్టోరీ టర్నింగ్ పాయింట్. అతను పోలీస్ ఆఫీసర్ అనేది మరో మలుపు. ఇలా క్లైమాక్స్ కొంత గందరగోళానికి గురిచేస్తుంది. మిగతా దర్శకులు ఊహించలేని స్క్రీన్ ప్లే తో...ఉపేంద్ర మాత్రమే తీయగల సినిమా ఇది. పాటల ప్లేస్ మెంట్ సూపర్. తన ట్రేడ్ మార్క్ మూవీగా ఈ సినిమాను నిలబెట్టుకున్నాడు ఉపేంద్ర. అయితే సెకండాఫ్ క్లారిటీ గా తీసుంటే సక్సెస్ ఫుల్ సినిమా అయ్యేది.. ఫ్లస్ పాయింట్స్ ఉపేంద్ర నటన సంభాషణలు ఫస్టాఫ్ మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే సెకండాఫ్ ఎక్కువైన ట్విస్టులు క్లైమాక్స్ ....మాగాల్ఫ్ రేటింగ్ 2/5
--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









