విదేశీయుల రాకకు అడ్డుకట్ట వేయాలని బ్రిటన్..!
- October 04, 2016
విదేశీ చదువుల కోసం బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు పెద్ద దెబ్బ. విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం వచ్చే విదేశీయుల తాకిడిని కట్టడి చేయాలని బ్రిటన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. వలసలను భారీగా తగ్గించేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మేరకు బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి అంబర్ రడ్ బర్మింగ్‌హమ్‌లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో కీలక ప్రకటన చేశారు. వలసలను నివారించడంలో భాగంగా వ్యూహాత్మకంగానే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగిందని ఆమె స్పష్టం చేశారు.
ఇందుకుగాను మరికొన్ని మార్గాలనూ అనేషిస్తున్నామని.. విద్యాభ్యాసం, ఉద్యోగం కోసం బ్రిటన్‌కు వచ్చే వారి నియామకాల కోసం నిబంధనలు కఠినతరం చేస్తామని ఆమె ప్రకటించారు. విదేశీయులను ఉద్యోగాల్లో తీసుకునే సంస్థల కోసం ఉద్దేశించిన 'రెసిడెంట్ లేబర్ మార్కెట్ టెస్ట్' నిబంధనలనూ కఠినతరం చేస్తామన్నారు. యూకేలో ఏదైనా ఒక సంస్థ విదేశీయులకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే రెండే మార్గాలు..ఒకటి, ఇప్పటికే ఆ దేశం అధికారికంగా రూపొందించిన 'షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్'లో ఉన్న ఉద్యోగం అయితే విదేశీయులకు సులభంగా ఆ ఉద్యోగాన్ని ఇచ్చేయొచ్చు. ఆ జాబితాలో లేకపోతే.. కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దాన్నే 'రెసిడెంట్ లేబర్ మార్కెట్ టెస్ట్' అంటారు.ఇందులో భాగంగా ఒక సంస్థ విదేశీయులకు ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేయాలంటే ముందుగా తమదేశంలో ఆ ఉద్యోగం ఎక్కడ అవసరమో ఆ ప్రాంతంలో రెండుచోట్ల దానికి సంబంధించిన ప్రకటన ఇవ్వాలి. అది కూడా వరుసగా 28 రోజులు లేదా రెండు దశల్లో (మొత్తం కలిపి) 28 రోజులపాటు ప్రకటన ఇవ్వాలి. ఏ ఉద్యోగం, ఆ ఉద్యోగంలో భాగంగా చేయాల్సిన విధులేంటి? ఎక్కడ పనిచేయాలి?జీతం ఎంత? ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలేమిటి.. తదితర అంశాలను వివరంగా ప్రకటనలో పేర్కొనాలి. ఆ దేశంలో ఎవరి నుంచీ ఆ ప్రకటనకు స్పందన రాకపోతే అప్పుడు విదేశీయులకు అవకాశం ఇవ్వాలి.ఈ టెస్టులో ఉన్న లొసుగులను సవరించి నిబంధనలను మరింత కఠినతరం చేయడం ద్వారా విదేశీయుల రాకకు అడ్డుకట్ట వేయాలని బ్రిటన్ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







