క్యాబ్ అగ్రిగేటర్ ఓలా తాజాగా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను జోడించింది..!
- October 04, 2016
క్యాబ్ అగ్రిగేటర్ ఓలా తాజాగా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను జోడించింది. దీనితో ఇంటర్నెట్ లేనప్పటికీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్యాబ్‌ను బుక్ చేయవచ్చు. బుక్ వయా ఎస్ఎంఎస్ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కస్టమర్ మొబైల్ నుంచి లొకేషన్‌తో కూడిన వివరాలతో ఒక మెసేజ్ ఓలాకు వెళ్తుంది. వెంటనే కస్టమర్‌కు సమీపంలో ఉన్న మైక్రో, మినీ, ప్రైమ్, లగ్జరీ క్యాబ్‌ల వివరాలతో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. కస్టమర్ తనకు నచ్చిన క్యాబ్‌ను ఎంచుకోవచ్చు.ఎంపిక చేసుకోగానే డ్రైవర్, క్యాబ్ వివరాలతో మరో ఎస్ఎంఎస్ వస్తుంది. అటు డ్రైవర్‌కూ కస్టమర్ సమాచారం, జీపీఎస్ లొకేషన్ సైతం ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది. ఇంటర్నెట్ ఉంటే రైడ్ వివరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఎస్‌వోఎస్ బటన్ వంటి ఫీచర్లు వినియోగించుకోవచ్చు.ఓలా ఆఫ్‌లైన్ బుకింగ్ సౌకర్యం ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఉంది. దశలవారీగా మొత్తం 102 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని ఓలా ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









