కేసీఆర్‌ అధికారిక నివాసంలో బతుకమ్మ వేడుకలు ...

- October 05, 2016 , by Maagulf
కేసీఆర్‌ అధికారిక నివాసంలో  బతుకమ్మ వేడుకలు ...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసంలో బుధవారం మధ్యాహ్నం బతుకమ్మ వేడుకలు సందడిగా జరిగాయి. తీరొక్క పూలతో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు సీఎం నివాసానికి తరలివచ్చారు. బతుకమ్మను పేర్చుతూ మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. దీంతో సీఎం నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com