ఢిల్లీలో భద్రతను పెంచారు...
- October 05, 2016
దసరా ఉత్సవాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను పటిష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలు వేగం పుంజుకున్నాయి. ఢిల్లీలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. రాంలీలా కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే అదునుగా చూసుకుని దాడి చేసుందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వ్యూహరచన చేసుకున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు కూడా ఉగ్రవాదుల సంచారానికి సంబంధించిన సమాచారం అందింది. పక్షం రోజుల క్రితం దేశంలోకి ప్రవేశించిన కొందరు ఉగ్రవాదులు ఢిల్లీ వైపు కదిలారని సారాంశం. దీంతో ఢిల్లీ పోలీస్ శాఖలోని స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందం అప్రమత్తం అయింది.సరిహద్దులో భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భద్రతను పెంచారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రదేశాలు, కేజ్రీవాల్ కార్యాలయం, ఇండియాగేట్, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లలో, వివిధ ఆలాయాలవద్ద కూడా భద్రతను పటిష్టం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







