బహరేన్ లో ప్రైవేట్ పాఠశాల చట్ట ఉల్లంఘన

- October 05, 2016 , by Maagulf
బహరేన్ లో ప్రైవేట్ పాఠశాల  చట్ట ఉల్లంఘన

మనామా: చౌఈఫేట్ అంతర్జాతీయ పాఠశాల  విద్య మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి  అనుమతి పొందకుండా సాంఘిక శాస్త్రం బోధన కోసం వారి  స్వంత పుస్తకంనే  భోధిస్తున్నారని సామాజిక మీడియా ద్వారా ప్రచారం జరుగుతుంది  

మంత్రి వర్గం నుండి ఒక ప్రతినిధి బృందం వాస్తవ పరిస్థితిని పరిశీలించడానికి చౌఈఫేట్ అంతర్జాతీయ  పాఠశాలను సందర్శించారు, 9 వ తరగతి  విద్యార్థులకు సాంఘిక శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో బోధించడం గమనించారు. సంబంధిత పాఠశాల మంత్రిత్వ శాఖ నుంచి  ఎటువంటి అనుమతి తీసుకోకుండా విద్యార్థులకు ఈ తరహా బోధన జరుపుతున్నట్లు గుర్తించింది. వారు బోధిస్తున్న పుస్తకంలో బహరేన్ సాధారణ విధానాల విరుద్ధ వివాదంలో కొనసాగడం గమనార్హం. ప్రైవేట్ విద్యా మరియు శిక్షణ సంస్థలపై 1998 డిక్రీ  చట్ట సంఖ్య 25 యొక్క నిబంధనలకు ఈ పాఠశాల  స్పష్టమైన ఉల్లంఘన విషయాలు కలిగి ఉంది. దీని ప్రకారం శాఖపరమైన చర్యల ప్రక్రియకు ఆదేశిస్తూ పాఠశాలకు ఒక అధికారిక హెచ్చరిక ఆదేశించింది. అలాగే బోధిస్తున్న పుస్తకంలోని పాఠాలను ప్రస్తుత జాబితాలు ఉపసంహరించుకోవాలని కోరుతూ, పాఠశాల కూడా ఒక ప్రత్యామ్నాయ పుస్తకాన్ని అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ మరియు మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక ఆమోదం కోరుతూ అభ్యర్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com