బహ్రెయినీలను టార్గెట్ చేస్తున్న ఆన్‌లైన్ స్కామర్స్
- October 05, 2016
ఆన్‌లైన్ వేదికగా మోసాలు పెరిగిపోతున్నాయి. బహ్రెయినీ యువతకు ఆన్‌లైన్ స్కామర్స్ గాలం వేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గత కొద్ది నెలలుగా ఈ తరహా మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా బహ్రెయినీ యువత ఈ మోసాలకు గురవుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా వర్క్ ఎట్ హోమ్ ఆఫర్స్‌తో ఈ మోసాలు మొదలవుతున్నాయి. రోజుకి 91 బహ్రెయినీ దినార్స్ ఇస్తామని చెబుతూ స్కామర్స్ సోషల్ మీడియా ద్వారా యువతని ఆకట్టుకుంటున్నారు. ఈ పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం కొంత మొత్తం ముందుగా చెల్లించాలని డిమాండ్ చేయడం, అమాయకులు వారు అడిగిన సొమ్ములు చెల్లించడం, ఆ తర్వాత స్కామర్స్ పత్తా లేకుండా పోవడం జరుగుతోంది. ఫేక్ జాబ్ ఆఫర్స్‌కి స్పందించకపోవడం, అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా వాటి నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్‌లైన్ స్కామర్స్ మోసాల కారణంగా ఎంతోమంది యువత తమ జీవితాల్ని నాశనం చేసుకున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







