హరికేన్ మాథ్యూ హైతీని గడగడలాడించింది
- October 05, 2016
హరికేన్ మాథ్యూ హైతీని గడగడలాడించింది. ఈ తుపాన్ ధాటికి 20 మంది మృతి చెందారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని అధికారులు అన్నారు. హరికేన్ ప్రస్తుతం క్యూబా వద్ద కేంద్రీకృతమై ఉంది. నైరుతి హైతీ మొత్తం హరికేన్ ప్రభావానికి లోనైంది. దాదాపు 4 రోజులు భయపెట్టిన తర్వాత హరికేన్ తీరం దాటింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 50 ఏళ్లలో ఇంతటి హరికేన్ చూడలేదని హైతీ తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. హరికేన్ దెబ్బకు చెట్లు నేలకూలాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. మారుమూల ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. హుటాహుటిన తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సాయం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







