యాంటీ టెర్రర్ చట్టంపై జిసిసి మంత్రుల చర్చ
- October 06, 2016
రియాద్: ఆరు గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన జస్టిస్ మినిస్టర్స్ సమావేశమై, జిసిసి దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు, జస్టిస్ విభాగంలో కలిసి పనిచేయడం, అలాగే తీవ్రవాద సంబంధిత సమస్యలపై చర్చించారు. 28వ మినిస్టీరియల్ మీటింగ్ ఆఫ్ ది జిసిసి జస్టిస్ మినిస్టర్స్ కార్యక్రమానికి మినిస్టర్ ఆఫ్ జస్టిస్ వాలిద్ అల్ సమాని నాయకత్వం వహించారు. జిసిసి రీజియన్ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోందనీ, అందులో ముఖ్యమైనది తీవ్రవాదమని ఆయన చెప్పారు. అలాగే జిసిసి దేశాల మధ్య మనుషుల అక్రమరవాణా, దీనికి సంబంధించి కేసుల విచారణ సందర్భంగా జిసిసి దేశాల మధ్య జస్టిస్ చట్టాల పట్ల అవగాహన, కలిసి పని చేయడం వంటి అంశాలపైన కూడా చర్చ జరిగింది. కొత్త చట్టాలు చేసే విషయంలో పరస్పర సమాచార మార్పిడి, అవగాహన వంటి విషయాలూ చర్చకు వచ్చాయి. జస్టిస్ ఎగైనెస్ట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం (జెఎఎస్‌టిఎ)పై చర్చ సందర్భంగా, జిసిసి దేశాలు తీవ్రవాదం కారణంగా ఎదుర్కొన్న అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జెఎఎస్‌టిఎపై సుదీర్ఘమైన చర్చ జరగాల్సి ఉందనీ, ఇది అంతర్జాతీయ చట్టాల నిబందనలకు వ్యతిరేకంగా ఉందని అల్ సమాని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







