భారత్ - పాకిస్థాన్ సరిహద్దును 2018, డిసెంబర్ నాటికి మూసివేస్తాo..

- October 07, 2016 , by Maagulf
భారత్ - పాకిస్థాన్ సరిహద్దును 2018, డిసెంబర్ నాటికి మూసివేస్తాo..

భారత్ - పాకిస్థాన్ సరిహద్దును 2018, డిసెంబర్ నాటికి మూసివేస్తామని, దీనిపై ఆలోచిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. జైసల్మేర్‌లో సరిహద్దు రాష్ర్టాలైన పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూకశ్మీర్ సీఎంలు, హోంమంత్రులతో భద్రతపై సమీక్షించిన అనంతరం రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అందరం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారత సైనికులపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పారు. దాడులకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. సరిహద్దుల్లో పరిస్థితిపై నెలవారీగా, మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.ఎన్‌ఎస్‌ఏ, బీఎస్‌ఎఫ్ బలగాలతో నిరంతర సమీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. బోర్డర్ సెక్కూరిటీ గ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టి.. సరిహద్దు రాష్ర్టాల నుంచి ఎప్పటికప్పుడు భద్రతపై సమాచారాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com