ముప్పు పొంచి ఉన్న విమానాశ్రయాల వద్ద భద్రత..
- October 07, 2016
దేశరాజధాని దిల్లీ సహా 22 నగరాల్లో విమానాశ్రయాలకు ఉగ్రముప్పు పొంచివుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ముప్పు పొంచి ఉన్న విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రానికి నిఘా వర్గాలు సూచించాయి. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 22 విమానాశ్రయాలకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. దీంతో ప్రయాణికుల బ్యాగులతోపాటు పార్కింగ్ ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత పటిష్ఠ భద్రత కల్పించాలని కోరుతూ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాసింది.గురురువారం ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమై నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను వివరించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు సుమారు 100 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని దోవల్ ప్రధానికి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







