19.4 టీఆర్‌పీ రేటింగ్ సాధించిన 'బిచ్చగాడు'

- October 07, 2016 , by Maagulf
19.4 టీఆర్‌పీ రేటింగ్ సాధించిన 'బిచ్చగాడు'

విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో 'పిచ్చైకారన్' సినిమా నిర్మించిన ఫాతిమా విజయ్ ఆంటోని తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో చదలవాడ పద్మావతి విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏ సినిమా అయినా రెండు వారాలకు మించి థియేటర్‌లలో ఉండడం లేదు. కానీ తెలుగులో బిచ్చగాడు సినిమా 100 పూర్తి చేసుకుంది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఇదే సినిమా బుల్లితెరపై కూడా హల్‌చల్ చేస్తుంది. గత వారం టెలికాస్ట్ అయిన ఈ చిత్రం 19.4 టీఆర్‌పీ రేటింగ్ సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం విజయ్ ఆంటోని 'బేతాళుడు' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com