చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
- October 07, 2016
చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. తూర్పు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేగి తుఫాను చైనాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైఫూన్ కారణంగా ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 3.15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. టైఫూన్ కారణంగా కొండ చరియల నుంచి వచ్చిన 4 లక్షల క్యూబిక్ మీటర్ల చెత్త సుయ్చాంగ్ కౌంటీలోని సుచాన్ గ్రామంలో పేరుకుపోయింది. బుధవారం ఏకంగా 20 గృహాలు పూర్తిగా శిథిలమై సమాధి అయిపోయాయి. ఈ ఘటనలో 27 మంది గల్లంతుకాగా 17 మంది మృత్యువాత పడినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







