లక్ష్మి పన్యాల బొమ్మల కొలువు
- October 08, 2016
సౌతిండియాలో బొమ్మల కొలువుకు విశేష ప్రాధాన్యత ఉంది. దసరా సందర్భంగా ఎక్కువగా ఈ బొమ్మల కొలువులు దర్శనమిస్తాయి. దుబాయ్‌లో లక్ష్మి పన్యాల, అక్కడి భారతీయులకు స్వదేశంలో ఉన్నట్లుగా అనిపించేలా బొమ్మల కొలువుని నిర్వహిస్తున్నారు. తన ఇంట్లో ఈ మేరకు బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి, అందర్నీ ఆహ్వానిస్తున్నారు. అల్ ఖాసిమియా, షార్జాలోని అల్ బుస్తాన్ హొటల్ వెనుక, హిస్సా సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న మజీద్ బిల్డింగ్‌లోని ఫ్లాట్ నెంబర్ 602లో ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువులో పెళ్ళి గాజుల సందడి, గౌరీ పూజ, మెహందీ, ఎదురు సన్హాము, సప్తపది, కన్యాదానము, తలంబ్రాలు, విందు భోజనం వంటివి అందంగా కవర్ చేయబడ్డాయి ఈ బొమ్మల కొలువులో. అట్లంటిస్ హోటల్ని కవర్ చేస్తూ దుబాయ్ సిటీని కూడా ఈ బొమ్మల కొలువులో ఏర్పాటు చేశారు. బుర్జ్ ఖలీఫా, డిజర్ట్ సఫారి, మిరాకిల్ గార్డెన్, దుబాయ్ ఎయిర్పోర్ట్ వంటివి కూడా ఈ బొమ్మల కొలువులో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. బొమ్మల కొలువుని చూస్తే, నిజంగా ఆ లోకంలోకి మనం వెళ్ళిపోయేలా లక్ష్మి పన్యాల, ఆమె భర్త శ్రీనివాస్ పన్యాల ఈ ఈవెంట్‌ని ఏర్పాటు చేయడం గమనించదగ్గది. దేశాలు దాటినా మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా చేయడంలో మన తెలుగువారు మిగతావారందరికీ ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
_1475947404.jpg)
_1475947426.jpg)




తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







