షాప్లో దొంగతనం: మహిళల అరెస్ట్
- October 10, 2016
పోలీసులు వేగంగా స్పందించడంతో దొంగతనానికి పాల్పడిన మహిళలు అరెస్టయ్యారు. వారి నుంచి 400 బహ్రెయినీ దినార్స్ విలువైన ఆభరణాల్ని రికవర్ చెయ్యగలిగారు. ఆసియాకి చెందిన ఓ జ్యుయెలరీ వ్యాపారి నుంచి మహిళలు తెలివిగా ఆభరణాల్ని కాజేశారు. సిసిటివి ఫుటేజిని పరిశీలించాక, దొంగతనానికి పాల్పడిన మహిళల్ని గుర్తించగలిగారు. వారు షాపు నుంచి వెళ్ళిన కాస్సేపటికే దొంగతనం జరిగిందని తెలుసుకున్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి, సిసిటీవీ ఫుటేజిని పరిశీలించి, మహిళల్ని గుర్తించారు. దొంగతనానికి పాల్పడ్డ మహిళలంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సిట్రాకి చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనాలు ఆ మహిళలకు అలవాటేనని గతంలో పలు కేసుల్లో వీరు అరెస్టయ్యారని పోలీసులు తెలిపారు. సిసిటివి రికార్డుల ద్వారానే దొంగల్ని పట్టుకోడానికి వీలయ్యిందనీ, దుకాణదారులెవరైనాసరే వాటిని అమర్చుకోవడం తప్పనిసరి అని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







