ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్న పన్నీర్ సెల్వం
- October 11, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నమ్మినబంటుగా ఉన్న ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు అమ్మ శాఖలన్నీ అప్పగించారు. కాగా ఇది వరకే ఈయన ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రిగా అమ్మ కేబినెట్లో ఉన్నారు. అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. దీంతో అమ్మ శాఖలన్నీ పన్నీరు సెల్వంకే అప్పగించారు. ఆర్థిక మంత్రికే అమ్మ శాఖలన్నీ అప్పగిస్తూ రాజ్‌భవన్ నుంచి కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్టికల్ 166 ప్రకారం కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్ సెల్వంకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జయలలిత సూచన మేరకే ఆర్థిక మంత్రికి శాఖలు అప్పగించామని రాజ్ భవన్ ఉత్తర్వులో పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







