దుబాయ్‌లో దాండియా నవరాత్రి సెలబ్రేషన్స్‌

- October 11, 2016 , by Maagulf


దుబాయ్‌లో దాండియా నవరాత్రి సెలబ్రేషన్స్‌ అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు గాగ్రా చోళి - కచ్‌ ఎంబ్రాయిడరీ చనియా చోలీ, బంజారా స్టైల్‌ మరియు, కుట్చి స్టైల్‌ సంప్రదాయ వస్త్రధారణతో దాండియా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. వీరిలో ఒకరు ఇండియన్‌, ఒకరు శ్రీలంకన్‌, ఒకరు కెన్యన్‌, ఒకరు జింబాబ్వేయన్‌, ఒకరు నైజీరియన్‌, ఒకరు పిలిప్పినో, మరియు ఇద్దరు ఇండియన్‌ చిన్నారులు ఉన్నారు. ఒవిలియా ఫెర్నాండెస్‌, ప్రైస్‌ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ మరియు ఈవెంట్స్‌ ఎల్‌ఎల్‌సి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దుబాయ్‌లోని సంస్థ కార్యాలయం ఇందుకు వేదికయ్యింది. విషాల్‌ మహ్తానికి ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భాగ్యశ్రీ చందన్‌ మరియు కోమల్‌ సెలర్కా ఔట్‌ ఫిట్స్‌ని అందించారు. అలిషా ప్రో బ్యూటీ స్టోర్‌ మేకప్‌ చేశారు. ఎహ్‌తషమ్‌ సయీద్‌ ఫొటోగ్రఫీ అందించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com