చారిత్రక మసీదుల అభివద్ధికి కింగ్ ఓకే
- October 12, 2016
మదీనాలోని చారిత్రక మసీదుల్ని పునరుద్ధరించేందుకు, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్లాన్‌కి కింగ్ సల్మాన్ ఆమోద ముద్ర వేశారని ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్ వెల్లడించారు. సౌదీ కమిషన్ ఫర్ టూరిజం మరియు నేషనల్ హెరిటేజ్ (ఎస్‌సిటిఎన్‌హెచ్) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్. చారిత్రక మసీదుల్ని రినోవేట్ చేసేందుకుగాను ఫండ్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్స్ సుల్తాన్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతి పౌరుడూ తమతో కలిసి పనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారాయన. అర్బన్ హెరిటేజ్ సెంటర్‌లో భాగంగా చారిత్రక మసీదుల్ని పరిరక్షించుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. ఓల్డ్ జెడ్డాలోని ఓత్‌మాన్ బిన్ అఫ్ఫాన్ చారిత్రక మసీదు సహా పలు ముఖ్యమైన మసీదుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని, చారిత్రక సంపదను కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలకి వాటి వైభవం గురించి చాటి చెప్పడానికి వీలవుతుందని ప్రిన్స్ సుల్తాన్ చెప్పారు. ఈ మేరకు నిర్వహించిన వర్క్ షాప్‌లో పెద్ద సంఖ్యలో డొనేషన్లు మసీదుల డెవలప్‌మెంట్ పండ్ కోసం అందాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







