ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమం... పల్లె రఘునాథ్‌రెడ్డి,,

- October 12, 2016 , by Maagulf
ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమం... పల్లె రఘునాథ్‌రెడ్డి,,

ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. వారిని త్వరలో దేశానికి తీసుకువస్తామని బుధవారం అనంతపురంలో ఆయన మీడియాకు చెప్పారు. ఇథియోపియాలోని మడమాల విశ్వవిద్యాలయంలో రాష్ర్టానికి చెందిన తెలుగు ప్రొఫెసర్లు చాలామంది నిర్బంధంలో ఉన్నారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వెంటనే స్పందించిందన్నారు. రాష్ట్ర యంత్రాంగం విదేశ వ్యవహారాల మంత్రితో ఫోన్‌లో మాట్లాడిందని, అంతేకాకుండా ఆ దేశ ఎంబసీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నదని వెల్లడించారు.ఆ దేశ విద్యా శాఖ మంత్రితో మాట్లాడామన్నారు. నిర్బంధంలో ఉన్న తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నారని తమతో చెప్పారన్నారు. త్వరలో వారందరినీ దేశానికి తీసుకువస్తామన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com