షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'రోబో 2.0' చిత్రం

- October 12, 2016 , by Maagulf
షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'రోబో 2.0' చిత్రం

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రోబో 2.0' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా యూనిట్‌ సభ్యులతో రజనీకాంత్‌ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ విషయాన్ని కథానాయిక అమీజాక్సన్‌ ట్వీట్‌ పెట్టారు. 2010లో రజనీ-శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈచిత్రం ఫస్ట్‌లుక్‌ను నవంబర్‌ 20న, టీజర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షరుకుమార్‌ నటిస్తున్న విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com