ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమం... పల్లె రఘునాథ్‌రెడ్డి,,
- October 12, 2016
ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. వారిని త్వరలో దేశానికి తీసుకువస్తామని బుధవారం అనంతపురంలో ఆయన మీడియాకు చెప్పారు. ఇథియోపియాలోని మడమాల విశ్వవిద్యాలయంలో రాష్ర్టానికి చెందిన తెలుగు ప్రొఫెసర్లు చాలామంది నిర్బంధంలో ఉన్నారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వెంటనే స్పందించిందన్నారు. రాష్ట్ర యంత్రాంగం విదేశ వ్యవహారాల మంత్రితో ఫోన్లో మాట్లాడిందని, అంతేకాకుండా ఆ దేశ ఎంబసీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నదని వెల్లడించారు.ఆ దేశ విద్యా శాఖ మంత్రితో మాట్లాడామన్నారు. నిర్బంధంలో ఉన్న తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నారని తమతో చెప్పారన్నారు. త్వరలో వారందరినీ దేశానికి తీసుకువస్తామన్నారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







