ఒంటె...తెచ్చిన తంటా.... తెగి పడిన వేలుని అతికించిన వైద్యులు

- October 13, 2016 , by Maagulf
ఒంటె...తెచ్చిన తంటా.... తెగి పడిన వేలుని అతికించిన వైద్యులు

అబూ ధాబీ : పండగలు పబ్బాలు వస్తే...నిర్ధాక్షిణ్యంగా మమ్ముల్ని కోసుకుతింటారు కదా....ఆ నొప్పి ఏమిటో కొద్దిగా రుచి చూపించాలని బావించిందేమో ఓ గడసరి ఒంటె...  మేత పెడుతున్న సమయంలో ఓ యువకుని  చేతి మధ్య వేలుని కఠక్కమని కొరికి.. పుటుక్కుమని  ఉసి పారేసింది...దాంతో తెగి కిందపడిపోయిన ఆ వేలుని పుచ్చుకొని లబోదిబోమంటూ ఆసుపత్రికి పరిగెత్తాడా కుర్రోడు..అక్కడ వైద్యులు ఆ వ్యక్తి వేలుకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసి తిరిగి చేతికి యధావిధిగా అతికించారు .. తరమ్ ఆసుపత్రి వర్గాలు మంగళవారం రాత్రి ఈ విషయాన్ని " మా గల్ఫ్ డాట్ కామ్ "  తెలిపారు.  26 ఏళ్ల వ్యక్తి  ఒంటెకు మేత పెడుతున్నసమయంలో జరిగిన ఈ సంఘటనకు వెంటనే తేరుకొని తెగిన వేలుతో  ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేరడంతో అతని కుడి చేతి మధ్య వేలు పోస్ట్ ట్రామాటిక్ విచ్ఛేదన శస్త్ర చికిత్స జరిపినట్లు ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఒక శరీర భాగం విచ్ఛేదనం జరిగినప్పుడు తక్షణమే  రోగి శరీర భాగం కాపాడేందుకు ఆయా శరీర భాగంతో ఆసుపత్రికి తీసుకురావడం ఎంతో కీలకమైనది. తెగిన వేలుతో రోగి తరమ్ ఆసుపత్రికి వెంటనే రావడం అతని  అదృష్టం అని తరమ్  వద్ద ప్రాథమిక సర్జన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ అమ్మార్ అల్ దమిం చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com