ఏకకాలంలో మూడు తమిళ సినిమాలకు ఎంపికైన రకుల్ ..
- October 13, 2016
ఆనంద్‌శంకర్ దర్శకత్వంలోని 'ఇరుముగన్' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించారు నటుడు విక్రం. చాలా కాలం తర్వాత ఒకింత హిట్‌ను సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్నారు ఆయన. ప్రస్తుతం ఆయన హరి దర్శకత్వంలో 'సామి 2'లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. విక్రం హీరోగా తిరునెల్వేలి నేపథ్యంలో విడుదలైన 'సామి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ రానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కూడా త్రిష కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరో కథానాయికగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం సూర్య నటిస్తున్న 'ఎస్ 3'లో బిజీగా ఉన్న హరి.. ఆ సినిమా పూర్తయిన వెంటనే 'సామి 2'పై దృష్టి పెట్టనున్నారు. రకుల్‌కు మరింత ప్రాధాన్యత ఉన్న పాత్రను కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది రకుల్.విశాల్ హీరోగా 'తుప్పరివాలన్'లో కూడా కథానాయికగా ఎంపికైంది. మొత్తానికి ఏకకాలంలో మూడు తమిళ సినిమాలకు ఎంపికైంది రకుల్ ప్రీత్‌సింగ్.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







