దొంగతనం చేస్తున్న ఇద్దరు ఆసియా దేశస్థులు అరెస్టు
- October 14, 2016
కువైట్:అదనపు ఆదాయం కోసం...అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశారా ప్రబుద్ధులు...అయితే, అక్రమం ఎన్నాళ్ళో సాగదు కాబట్టి వారి చోరకళకు భద్రతా దళాలు చెక్ పెట్టారు. కువైట్ లోని ఒక ప్రజా ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు ఆసియా దేశస్థులు తాము పనిచేస్తున్న చోటు నుంచి మాదక ద్రవ్యాలు మరియు ఇతర మందులను ఇటీవల దొంగిలించి విక్రయిస్తున్న నేపథ్యంలో వారిరువురిని అరెస్టు చేశారు. భద్రతా దళాల సమాచారం ప్రకారం ఈ అనుమానితులు రోజూ వారి జేబులలో ఆయా మాత్రలు పెట్టుకొని తమ తమ ఇళ్లకు చేర్చుకొనేవారు. మూడవ నిందితునికి విక్రయించే ముందు వారి నివాసంలో మాదక ద్రవ్యాలు మరియు ఇతర మందులను నిల్వ చేసేవారని తెలిపారు. ఆ మందులు అమ్మడం ద్వారా వారు సేకరించిన 1100 కువైట్ దినార్ల నగదు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొన్నారు.అలాగే, వారి వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న8.064 మాత్రలను సైతం సీజ్ చేశారు. ఆసుపత్రి నుంచి దోచుకున్న మందుల విలువ బహిరంగా మార్కెట్ లో 10,000 కువైట్ దినార్ల విలువ వరకు ఉంటుందని భద్రతా దళాలు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







