దక్షిణ కొరియాలో బస్సుకు మంటలు: పదిమంది మృతి

- October 15, 2016 , by Maagulf
దక్షిణ కొరియాలో  బస్సుకు మంటలు: పదిమంది మృతి

కొరియాలోని ఉల్సాన్ నగరంలో బస్సుకు మంటలు అంటుకున్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సు ముందుటైర్లు పేలిపోవడంతో అది డివైడర్‌కు ఢీకొని మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి మంటలు రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రయాణికులు చిక్కుకుపోయారు.

బయటకు వచ్చేందుకు ప్రయత్నించేలోపే మంటలు బాగా వ్యాపించాయి. దాంతో పదిమంది లోపలే మరణించారు. మరో ఏడుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ముగ్గురు మాత్రం దీన్నుంచి బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com