16 ఏళ్ళ కుర్రోళ్ళూ... ఇక డ్రైవింగ్ లైసెన్స్ కు అర్హులే

- October 15, 2016 , by Maagulf
16 ఏళ్ళ కుర్రోళ్ళూ... ఇక డ్రైవింగ్ లైసెన్స్ కు  అర్హులే

16 ఏళ్ళ వయస్సు ఉన్న యువకులు ఇకపై  దర్జాగా రోడ్లపై వాహనాలు నడపవచ్చు వారు నేరుగా  డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హత పొందినట్లేనని ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ (FTC) కమాండర్-ఇన్-ఛీఫ్ ఆపరేషన్స్ దుబాయ్ పోలీస్ ఛైర్మన్ మేజర్ జనరల్ మహ్మద్ సైఫ్ అల్ జాఫిన్ ఒక పత్రికా సమావేశంలో నివేదించారు 

10 సంవత్సరాల క్రితం ఆ వయస్సు కుర్రోళ్ళు కంటే ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో యువకులు మరింత పరిపక్వత సాధించారని వారు అభినందించే పద్ధతిలో వారు వాహనం నడపడం గమనించవచ్చని, వారికి లైసెన్స్ అనుమతించడంలో న్యాయం ఉందని ఆయన అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ వయస్సు17 ఏళ్ళ యువకులకు ఇవ్వాలని తొలుత యోచించామని  ఎఫ్  టి   సి  సమావేశం గురువారం మాట్లాడుతూ చెప్పారు.కానీ 16 సంవత్సరాల వయసులో కూడా వారికి డ్రైవింగ్ లైసెన్సుల ఇవ్వడం అర్హత అని ఆయన    తెలిపారు. లైసెన్స్ వయస్సు సవరించడానికి ముఖ్యమైన సామాజిక కోణాలు సైతం ఉన్నాయిని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
అత్యధిక కుటుంబాలలో తమ పిల్లల వయస్సు16 ఏళ్ళు లేదా 17 సంవత్సరాల వయస్సు ఉన్నవారు  ఎక్కువని, పలు సందర్భాలలో విదేశీ డ్రైవర్లు పెట్టేందుకు అనేక చేదు సంఘటలు గుర్తు చేశారు. తమ పిల్లలకు సురక్షితమైన రీతిలో కార్లు డ్రైవ్ చేయడం వచ్చినా వారికి  డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నారు. మోటార్ సైకిల్ డ్రైవింగ్ 17 సంవత్సరాల వయసులో యువతకు లైసెన్స్ ఉంటె కొన్ని సందర్భాలలో కారు డ్రైవింగ్ కంటే ప్రమాదకరంగా మారుతోంది వారు తగిన భద్రత కారణాల దృష్ట్యా కార్లు లైసెన్స్లు ఇవ్వడమే మేలని అన్నారు. జనరల్ అల్ జాఫిన్ మాట్లాడుతూ16 ఏళ్ళ వయస్సులో విశ్వాసం అధికంగా ఉంటుందని ముఖ్యంగా 24 ఏళ్ళ వయస్సు 35 ఏళ్ళ వయస్సు వ్యక్తులు చేసే ట్రాఫిక్ ప్రమాదాలు అత్యధికమని ఆయన విశ్లేషించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com