'ఎక్కడికి పోతావు చిన్నవాడా..'తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్న నిఖిల్..

- October 16, 2016 , by Maagulf
'ఎక్కడికి పోతావు చిన్నవాడా..'తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్న నిఖిల్..

ప్పుడు కుర్ర హీరోలంతా రెగ్యులర్ కథాంశాలను వదిలేసి ప్రయోగాల బాట పడుతున్నారు. వెరైటీ కథలు దొరికితే చాలు రెడీ అంటున్నారు. అదే బాటలో నడుస్తున్నాడు నిఖిల్. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి సినిమాలను చూస్తే అతడి కథల ఎంపిక ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త కథనంతో ముందుకు రాబోతున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా..'తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. మనిషి చనిపోయాక 21 గ్రాముల బరువు తగ్గుతాడు అంటూ ఓ ఆత్మ కాన్సెప్ట్‌తో భయపెట్టబోతున్నాడు. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీవీఆర్ సంస్థ నిర్మించింది. నవంబరులో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు.నిఖిల్ కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com