చమురుపైనే కాకుండా ఇతరత్రా ఆదాయంపై దృష్టి

- October 17, 2016 , by Maagulf
చమురుపైనే కాకుండా ఇతరత్రా ఆదాయంపై దృష్టి

సౌదీ అరేబియా.. మిషన్‌ 2030
చమురుపైనే కాకుండా ఇతరత్రా ఆదాయంపై దృష్టి
సర్కారీ వ్యయం తగ్గింపు.. స్థానికులకే ఉపాధి కల్పన
విదేశీ కార్మికుల వీసా పొడిగింపునకు విముఖత!
గల్ఫ్‌లో మనవాళ్ల కష్టాలకు అనేక కారణాలు
సంస్కరణల రూపశిల్పి సౌదీ యువరాజు సల్మాన్‌
చమురు.. సౌదీ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు! కానీ ఇటీవలికాలంలో ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. కేవలం చమురుపైనే ఆధారపడకూడదని ఆ దేశం నిర్ణయించుకుంది. ఇతరత్రా ఆదాయం పెంపుపైనా..

వ్యయం తగ్గింపుపైనా దృష్టి సారించింది. చేపా చేపా ఎందుకు ఎండలేదు్‌ అనే కథ చందంగా.. మిషన్‌ 2030 పేరుతో సౌదీ యువరాజు చేపట్టిన సంస్కరణల దెబ్బ అటు తిరిగి ఇటుతిరిగి విదేశీ కార్మికులపై పడుతోంది! మన కార్మికుల చమురు్‌ వదులుతోంది!!
1,80,000 ఆవులు.. వాటికోసం ప్రత్యేకంగా నిర్మించిన ఏసీ షెడ్లు.. వందల అడుగుల లోతు నుంచి వాటి కోసం నీటి వసతి.. అర్జెంటీనా నుంచి వాటికి శ్రేష్టమైన దాణా ఏర్పాటు.. ఆ ఆవుల పాలను, ఇతర ఉత్పత్తులను అరేబియన్‌ పెనిన్సులావ్యాప్తంగా రవాణా చేయడానికి 9000 వాహనాలు!
ఇదంతా జరుగుతోంది ఎడారి దేశమైన సౌదీఅరేబియాలోనంటే నమ్ముతారా! ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నది.. సౌదీ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌. మిషన్‌ 2030 పేరుతో.. చమురేతర ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా సౌదీ సర్కారు చేపడుతున్న పలు చర్యల్లో ఈ డెయిరీ నిర్వహణ కూడా ఒకటి. ఆదాయార్జనపై సౌదీ వైఖరి మారడానికి ప్రధాన కారణం.. తగ్గిన చమురు ధరలు, యెమెన్‌లో యుద్ధం కారణంగా అవుతున్న ఖర్చు. వీటివల్ల బడ్జెట్‌లో గత ఏడాది దాదాపు 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6.67 కోట్లు) లోటు ఏర్పడింది. ఇది నానాటికీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో, ఆ లోటును పూడ్చే దిశగా యువరాజ్‌ సల్మాన్‌ ఇటీవలికాలంలో పలు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రయోజనాల తగ్గింపు, వేతన చెల్లింపు నెలను ఇస్లామిక్‌ క్యాలెండర్‌ నుంచి గ్రెగోరియన్‌ క్యాలెండర్‌కు మార్చడం, కొత్త ఫీజులు, జరిమానాల విధింపు, విదేశీయులకు వీసాల జారీ తగ్గించడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచడం వంటివి ఇందులో భాగమే. అలాగే.. చమురుబావులు మన చేతిలోనే ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఇన్నాళ్లుగా ఇంధనం, నీటి సరఫరా, విద్యుత ఉత్పాదనకు చమురును అత్యంత తక్కువ ధరలకు సరఫరా చేసేవారు. తక్కువ ధరకు వస్తుండడంతో ప్రజలు కూడా విచ్చలవిడిగా చమురును, కరెంటును వినియోగించేవారు. ఇప్పుడా భారీ రాయితీలన్నిటికీ కోతపెడుతుండడంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. అంతేకాదు.. అన్నిటికన్నా కీలకమైనది.. సౌదీ ఆర్థికవ్యవస్థకు మూలస్తంభమైన ఆ దేశ ప్రభుత్వ రంగ చమురు సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్‌ ఎగుమతిదారు అయిన ుసౌదీ అరేబియన్‌ ఆయిల్‌ కంపెనీ్‌లో కొంత వాటాను అమ్మే ప్రణాళికలూ ఉన్నాయని ప్రిన్స్‌ మహ్మద్‌ ఇటీవలే ప్రకటించారు. ఇలా, సౌదీ ఆర్థిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న యువరాజు ప్రణాళికలు ఆ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లుగా అక్కడ ఉంటున్న భారతీయుల, మన తెలుగువారి కష్టాలకు కూడా కారణం ఈ మార్పులే.
నిలిచిన నిర్మాణాలు..
దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టే ప్రణాళికలో భాగంగా సౌదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు నిర్మాణ ప్రాజెక్టులను ఎక్కడికక్కడ ఆపేసింది. దీంతో కార్మికులను తీసేయక తప్పని పరిస్థితి కాంట్రాక్టర్లకు ఏర్పడింది. అప్పటిదాకా రావాల్సిన వేతనాలు కూడా అందకపోవడంతో పలువురు విదేశీ కార్మికులు ఈ ఏడాది మొదట్లో పలు బస్సులకు నిప్పు పెట్టి తమ నిరసన తెలిపారు. ఇక.. కరెంటు, నీళ్లకు ఇన్నాళ్లుగా ఇచ్చిన రాయతీలకు కోత పెట్టడంతో భారీ బిల్లుల మోత భరించలేక సౌదీ ప్రజలు సోషల్‌ మీడియాలో గగ్గోలు పెట్టారు. వారి ఆవేదనకు సమాధానంగా ఆ దేశ జల, విద్యుత శాఖ మంత్రి.. ుూధరలు పెరగడంపై అసంతృప్తి ఉంటే మీ సొంత చమురు బావులు తవ్వుకోండి్‌్‌ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఆయన పదవి సైతం ఊడింది. 1990 నాటికి.. ఇప్పటికీ సౌదీ జనాభా రెండింతలు పెరిగింది. జనాభాలో సగానికి సగం మంది 25 ఏళ్ల లోపువారే. ఏటా దాదాపు 3 లక్షల మంది ఉద్యోగాలు చేయడానికి సిద్ధమవుతుండగా.. అన్ని అవకాశాలు లేకపోవడం వారిలో అసంతృప్తికి కారణమవుతోంది.
పద్నాలుగేళ్లలో..
ఇప్పుడు సౌదీవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. జాతీయచిహ్నంతో కూడిన 2030 లోగో కనపడుతుంది. వచ్చే పద్నాలుగేళ్లలో సౌదీ ఆర్థిక వ్యవస్థను చమురేతర ఆదాయంతో పరిపుష్టం చేయడమే 2030 ప్రణాళిక లక్ష్యం. పద్నాలుగేళ్ల ప్రణాళిక ఇది. ఇందులో భాగంగా.. మైనింగ్‌ పరిశ్రమను విస్తరించి బంగారం, ఫాస్పేట్‌, యురేనియం నిల్వలను వెలికితీసే యోచన ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానం, వినోదం, ఆర్థిక రంగాలను బలోపేతం చేసే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు ప్రిన్స్‌ మహ్మద్‌ సౌదీలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, అథ్లెట్లు, కళాకారులతో ఒక సమావేశం కూడా నిర్వహించారు. వీటన్నిటి ద్వారా 2020 నాటికే చమురేతర ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్నదానికన్నా మూడు రెట్ల మేర పెంచాలని.. ప్రైవేటు రంగంలో 4.5 లక్షల ఉద్యోగాల కల్పన సహా, ఉపాధి అవకాశాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యువరాజు మహ్మద్‌ చేపడుతున్న ఈ చర్యలన్నీ సౌదీ యువతకు ఆయనపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. అయితే.. ప్రభుత్వం, పరిశ్రమలు ఖర్చులను తగ్గించుకోవడం అంటే.. వృద్ధి రేటు తగ్గుతుంది. ఉద్యోగాలు తగ్గుతాయి. ఇలాంటి వాతావరణంలో స్థానికులకు ఉద్యోగాలను పెంచడానికి సౌదీకి ఉన్న ఏకైక అవకాశం.. విదేశీ కార్మికులను తగ్గించడం. వారి స్థానాల్లో స్థానికులను నియమించుకోవడం. ఇప్పుడదే జరుగుతోంది. దీన్నివారు ుసౌదైజేషన్‌్‌గా వ్యవహరిస్తున్నారు. 1980ల నాటికి సౌదీలో దాదాపుగా 10 లక్షల మంది విదేశీ కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య కోటికిపైగానే ఉంది. దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది. ఆయా కంపెనీల్లో నిర్ణీత శాతం కన్నా తక్కువ మంది స్థానికులు ఉంటే.. ఆ కంపెనీల్లో పనిచేసే విదేశీ కార్మికుల వీసాలను రెన్యూ చేయడానికి నిరాకరిస్తోంది. పైగా భారీ ఎత్తున జరిమానాలు విధిస్తోంది. దీంతో, ఒకింత ఆర్థిక భారమే అయినప్పటికీ కంపెనీలు చౌకగా దొరికే విదేశీ కార్మికుల స్థానంలో స్థానికులను తీసుకుంటున్నాయి. ఇదే మనవారి పాలిట విఘాతంగా మారింది.

3673 కోట్ల యాట్‌ కొనేశారు! 
ఉద్యోగుల జీతాలకు కత్తెర వేశారు! నీళ్లు, కరెంటు రాయితీలు కోసేశారు!! వేతన చెల్లింపు నెలను సైతం మార్చేశారు!! దేశ ఖర్చులను ఇంతగా తగ్గించిన సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. ఇటీవల ఫ్రాన్స్‌ వెళ్లినప్పుడు అక్కడ ఒక యాట్‌ను చూసి మనసు పారేసుకున్నారు. ఆ ఆ యాట్‌ ఒక రష్యన్‌ కుబేరుడిది. ఆ విషయం తెలుసుకున్న సల్మాన్‌.. వెంటనే తన సహాయకుడిని ఆయన వద్దకు పంపించి కొన్ని గంటల వ్యవధిలో ఆ యాట్‌ను అక్షరాలా 550 మిలియన్‌ డాలర్లకు ఉన్నపళంగా కొనేశారు. మన కరెన్సీలో అది దాదాపుగా రూ.3673 కోట్లకు సమానం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com