భారతదేశంలోని చమురు సంస్థలపై పాకిస్థాన్ నిఘా ..

- October 18, 2016 , by Maagulf
భారతదేశంలోని చమురు సంస్థలపై పాకిస్థాన్ నిఘా ..

భారతదేశంలోని చమురు సంస్థలపై పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. మన దేశంలోని ఓ ఆయిల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ నుంచి కీలక సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచారి సేకరిస్తుండటాన్ని తెలుసుకున్న తర్వాత ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. భద్రతను పటిష్ఠం చేయాలని చమురు మంత్రిత్వ శాఖకు సలహా ఇచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇటీవల ఓ కాల్‌ను రహస్యంగా విన్నపుడు పాకిస్థాన్ కుట్ర బయటపడింది. భారతదేశానికి చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ నిఘా అధికారినని చెప్పుకున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి రాజస్థాన్‌లోని హైడ్రోకార్బన్ పైప్‌లైన్‌ను నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్‌తో ఫోన్‌లో మాట్లాడాడు.ఈ కేంద్రానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వివరాలను ఆ వ్యక్తి కోరాడు. అనేక మంది పాకిస్థానీ గూఢచారులు మారుపేర్లతో భారతదేశంలోని ఎగ్జిక్యూటివ్‌లకు ఫోన్లు చేస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని ఇతరులకు తెలియజేయవద్దని ఎగ్జిక్యూటివ్‌లకు ఆదేశాలు ఇవ్వాలని ఐబీ కోరింది. అంతర్గత భద్రతకు సంబంధించిన విషయాలను హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని, తగిన చర్యలు తీసుకుంటుందని చమురు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి మాట్లాడుతూ రిఫైనరీల వద్ద పనిచేసే అధికారులను, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. పైప్ లైన్‌ను పేల్చేసినా, రిఫైనరీకి నష్టం కలిగించినా హాని దీర్ఘకాలం ఉంటుంది. ప్రాణనష్టంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లలోని చమురు కేంద్రాలు పాకిస్థాన్ దాడులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com