భారతదేశంలోని చమురు సంస్థలపై పాకిస్థాన్ నిఘా ..
- October 18, 2016
భారతదేశంలోని చమురు సంస్థలపై పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. మన దేశంలోని ఓ ఆయిల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ నుంచి కీలక సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచారి సేకరిస్తుండటాన్ని తెలుసుకున్న తర్వాత ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. భద్రతను పటిష్ఠం చేయాలని చమురు మంత్రిత్వ శాఖకు సలహా ఇచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇటీవల ఓ కాల్‌ను రహస్యంగా విన్నపుడు పాకిస్థాన్ కుట్ర బయటపడింది. భారతదేశానికి చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ నిఘా అధికారినని చెప్పుకున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి రాజస్థాన్‌లోని హైడ్రోకార్బన్ పైప్‌లైన్‌ను నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్‌తో ఫోన్లో మాట్లాడాడు.ఈ కేంద్రానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వివరాలను ఆ వ్యక్తి కోరాడు. అనేక మంది పాకిస్థానీ గూఢచారులు మారుపేర్లతో భారతదేశంలోని ఎగ్జిక్యూటివ్‌లకు ఫోన్లు చేస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని ఇతరులకు తెలియజేయవద్దని ఎగ్జిక్యూటివ్‌లకు ఆదేశాలు ఇవ్వాలని ఐబీ కోరింది. అంతర్గత భద్రతకు సంబంధించిన విషయాలను హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని, తగిన చర్యలు తీసుకుంటుందని చమురు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి మాట్లాడుతూ రిఫైనరీల వద్ద పనిచేసే అధికారులను, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. పైప్ లైన్‌ను పేల్చేసినా, రిఫైనరీకి నష్టం కలిగించినా హాని దీర్ఘకాలం ఉంటుంది. ప్రాణనష్టంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లలోని చమురు కేంద్రాలు పాకిస్థాన్ దాడులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







