అరుదైన ఘనత సాధించిన సానియాకు అభినందనలు..
- October 19, 2016
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనత సాధించింది. నంబర్ వన్ ర్యాంకులో వరుసగా 80 వారాలు కొనసాగి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు టాప్ ర్యాంకులో కొనసాగిన భారత క్రీడాకారిణిగా ఆమె తన పేరును లిఖించుకుంది. మార్టినా హింగిస్ తో కలిసి గత సీజన్ లో వోల్వో కార్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచి సానియా నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. అప్పటి నుంచి అప్రతిహతంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఈ ఘనత సాధించడం పట్ల సానియా సంతోషం వ్యక్తం చేసింది. 'నంబర్ వన్ ప్లేయర్ గా ఈ రోజుకు వరుసగా 80 వారాలు పూర్తి చేసుకున్నాను. ఇది అద్భుత ప్రయాణం. మరింతగా కష్టపడేందుకు నాకు ప్రేరణనిస్తోంద'ని సానియా ట్వీట్ చేసింది.అరుదైన ఘనత సాధించిన సానియాకు ట్విట్టర్ ద్వారా మహేశ్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాల అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







