'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' చిత్రీకరణ ప్రారంభo..
- October 19, 2016
''రా మోజీరావుగారు ఐదేళ్ల కిందట అర్థక్రాంతి పేరుతో ఓ సమావేశం నిర్వహించారు. అందులో వచ్చిన ఓ ఆలోచనతోనే ఈ కథ రాసుకొన్నా. నల్లధనం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది'' అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య'. ఆర్.నారాయణమూర్తి, జయసుధ జంటగా నటిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. చదలవాడ తిరుపతిరావు సమర్పకులు. బుధవారం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు క్లాప్‌నిచ్చారు.రామోజీ ఫిలింసిటీ ఎండీ ఎ.రామ్మోహన్రావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. చదలవాడ వెంకటేశ్వరరావు, డా.ఫెలోమినా, చిన్నమ్మ, రామోజీ ఫిల్మ్‌సిటీ సీఈవో రాజీవ్ జాల్నా పూర్కర్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ''మంచైనా, చెడైనా సినిమా మాధ్యమం ద్వారా తొందరగా ప్రజల్లోకి వెళుతుంది.అదే సమయంలో సినిమా ఎప్పుడూ ఆధునిక భావాలతో ముడిపడి ఉంటుంది. ఐదేళ్ల నుంచి నన్ను వెంటాడుతున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. నల్లధనం వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది? అనే విషయాన్ని ఓ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం నేపథ్యంలో తెరపై చూపించబోతున్నాం.డబ్బు చలామణీలోకి రాకపోతే మధ్య తరగతికి ఉపాధి దొరకడం కష్టమవుతుంది. దాని ప్రభావం సమాజంపై ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ చిత్రంలో చూపించబోతున్నాం. మనం కలిసి సినిమా చేద్దామని నా మిత్రుడు ఆర్.నారాయణమూర్తిని ఎప్పట్నుంచో అడుగుతున్నా. ఈ కథ చెప్పగానే ఆయన చేయడానికి ముందుకొచ్చారు.జయసుధ మా సంస్థలో ఇదివరకు సినిమాలు చేశారు. ఆవిడ కూడా అడగ్గానే సినిమా చేయడానికి అంగీకరించారు. సినిమా పూర్తయ్యేవరకు ఏకధాటిగా చిత్రీకరణ జరుగుతుంది. జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.యేసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కీరవాణి గీతాల్ని ఆలపించార''న్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ''కార్మికుడిగా, కర్షకుడిగా, ఉద్యమకారుడిగా, సగటు మనిషిగా తెరపై నటించి ప్రజల గుండెల్లో ఉన్నా. అయితే పోలీసు పాత్రలోనూ నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉండేది. 'అన్నా మీరు అన్ని రకాల పాత్రల్లోనూ కనిపిస్తుంటారు, మా వేషం ఎందుకు వేయరు?' అని పోలీసు సోదరులు తరచుగా అడిగేవాళ్లు.ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. సావిత్రిగారి తర్వాత నాకు ఇష్టమైన నటి జయసుధగారు. ఆమెతో కలిసి తెరను పంచుకొంటుండడం ఆనందంగా ఉంది'' అన్నారు.తెలుగు తల్లి కన్న బిడ్డ రామోజీరావు మనకందరికీ గర్వకారణం అంటూ ఆయనకి నారాయణమూర్తి శాలువా కప్పి సన్మానం చేశారు.జయసుధ మాట్లాడుతూ ''ఈ సినిమా గురించి వినగానే నాకే థ్రిల్‌గా అనిపించింది. ఆర్.నారాయణమూర్తి ఎప్పుడూ కమర్షియల్ సినిమాలో నటించలేదు. ఆయన, నేను ఇదివరకు ఎప్పుడూ తెరపై కలిసి కనిపించింది లేదు. అందుకే ఈ సినిమాపై నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది.ఒకరిపై ఒకరికి ఎంత గౌరవమున్నా కెమెరా ముందు మాత్రం నటీనటులం. నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటాం. నాకు, ఆర్.నారాయణమూర్తికి ఈ సినిమాలో అలాంటి పాత్రలే పడ్డాయి. ఇలాంటి విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాలి'' అన్నారు.''ఆర్.నారాయణమూర్తి మాకు ఆత్మీయుడు. జయసుధ మా సంస్థలో మంచి సినిమాలు చేశారు. వాళ్లిద్దరితో సినిమా తీస్తుండడం ఆనందంగా ఉంది. ఈమధ్యే మేం 'బిచ్చగాడు' సినిమా చేశాం.ఆ సినిమా మార్కెటింగ్‌కి మయూరి ఫిల్మ్స్ సంస్థ ఎంతో తోడ్పాటునందించింది. ఇకపై మేం వరుసగా 20 సినిమాల్ని రామోజీ ఫిలింసిటీలోనే తెరకెక్కిస్తాం'' అన్నారు చిత్ర సమర్పకుడు చదలవాడ తిరుపతిరావు.కార్యక్రమంలో చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న వై.విజయ, చలపతిరావు, కె.అచ్చిరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్, సునీల్‌కుమార్, సమీర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, విజయ్, పార్వతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుధాకర్‌రెడ్డి, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కూర్పు: మోహనరామారావు, నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం, పోరాటాలు: సతీష్
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







