అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది...

- October 20, 2016 , by Maagulf
అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని.. త్వరలోనే ఆమె ఇంటికి వెళ్తారని అధికార అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. 'అపోలో ఆస్పత్రి వైద్యులు, స్పెషలిస్టుల పర్యవేక్షణలో అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. త్వరలోనే ఆమె ఇంటికి వెళ్తారు' అని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి స్పష్టంచేశారు. వైద్యుల సూచన మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారన్నారు. జయలలిత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
సరస్వతితో పాటు అన్నాడీఎంకే మంత్రి ఒకరు, భాజపా నేత హెచ్‌వీ హాండే కూడా అమ్మ త్వరలోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు.అపోలో ఆస్పత్రికి వెళ్లి వైద్యులను, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురైను కలిశానని హెచ్‌వీ హాండే చెప్పారు. జయలలిత మరో వారం లేదా పది రోజుల్లో ఇంటికి వెళ్తారని విశ్వసిస్తున్నానని తెలిపారు. హాండే గతంలో రామచంద్రన్‌ హయాంలో అన్నాడీఎంకేలో మంత్రిగా పనిచేశారు. తమిళనాడులో పలుచోట్ల ఇంకా పార్టీ కార్యకర్తలు, అమ్మ మద్దతు దారులు ఆమె కోలుకోవాలని ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com