శివకాశిలో బాణాసంచా నిల్వచేసే ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
- October 20, 2016
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శివకాశిలో బాణాసంచా నిల్వచేసే ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. వారిలో ఐదుగురు మహిళలున్నారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి శివకాశిలో తయారయ్యే టపాసులు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు కూడా టపాసులు సరఫరా చేసే తమిళనాడులోని శివకాశిలో దాదాపు ప్రతియేటా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఇదే తరహా ప్రమాదం జరిగింది. శివకాశి శివార్లలో భారీస్థాయిలో మందుగుండు సామగ్రి నిల్వ చేసే ఓ గోడన్‌లో మంటలు చెలరేగాయి.అందులో దాదాపు 30 మంది వరకు పనివాళ్లు ఉన్నట్లు సమాచారం. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు లారీలు, 20 వరకు ద్విచక్ర వాహనాలు కూడా తగలబడిపోయాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ గోడౌన్ పక్కనే ఒక ప్రైవేటు ఆస్పత్రి కూడా ఉంది.. దానికి కూడా మంటలు వ్యాపించడంతో రోగులను వేరేచోటుకు తరలించారు. స్థానికులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. సంవత్సరం పొడవునా తయారుచేసిన టపాసులను శివారు ప్రాంతాల్లోని గోడౌన్లలో నిల్వచేస్తుంటారు. దీపావళి సమీపిస్తుండటంతో విక్రయాలు భారీఎత్తున కొనసాగుతుంటాయి. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పెద్దస్థాయిలో జరుగుతాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









