అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది...
- October 20, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని.. త్వరలోనే ఆమె ఇంటికి వెళ్తారని అధికార అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. 'అపోలో ఆస్పత్రి వైద్యులు, స్పెషలిస్టుల పర్యవేక్షణలో అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. త్వరలోనే ఆమె ఇంటికి వెళ్తారు' అని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి స్పష్టంచేశారు. వైద్యుల సూచన మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారన్నారు. జయలలిత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
సరస్వతితో పాటు అన్నాడీఎంకే మంత్రి ఒకరు, భాజపా నేత హెచ్వీ హాండే కూడా అమ్మ త్వరలోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు.అపోలో ఆస్పత్రికి వెళ్లి వైద్యులను, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైను కలిశానని హెచ్వీ హాండే చెప్పారు. జయలలిత మరో వారం లేదా పది రోజుల్లో ఇంటికి వెళ్తారని విశ్వసిస్తున్నానని తెలిపారు. హాండే గతంలో రామచంద్రన్ హయాంలో అన్నాడీఎంకేలో మంత్రిగా పనిచేశారు. తమిళనాడులో పలుచోట్ల ఇంకా పార్టీ కార్యకర్తలు, అమ్మ మద్దతు దారులు ఆమె కోలుకోవాలని ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్నారు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







